Divitimedia
Bhadradri KothagudemEntertainmentHyderabadLife StyleSportsSpot NewsTelanganaTravel And TourismWomen

మధిరలో 12న ముగ్గుల పోటీలు

మధిరలో 12న ముగ్గుల పోటీలు

హాజరు కానున్న భట్టి సతీమణి, సినీనటులు

✍️ మధిర – దివిటీ (జనవరి 8)

మధిర పట్టణంలోని సుందరయ్యనగర్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో జనవరి 12 న సంక్రాంతి పండుగ సందర్భంగా భారీ ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలకు డెప్యూటీ సీఎం సతీమణి మల్లు నందినితోపాటు సినీ ప్రముఖులు హాజరవుతున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో వెల్లడించారు. సినీ హీరో శ్రీకాంత్, నటీమణులు సురేఖవాణి, మీనాకుమారి, ప్రవీణ, రజిత, యాంకర్ సుమ కనకాల, తదితరులు ఈ పోటీల్లో ప్రత్యేక ఆకర్షణ కానున్నారు. మున్సిపల్ కౌన్సిలర్లు మల్లాది వాసు, సవిత దంపతుల ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగసంబరాల్లో భాగంగా ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈనెల 12న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్థానిక సుందరయ్యనగర్ లోని అన్నపూర్ణ హోటల్ రోడ్డులో ఈ ముగ్గుల పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు.

Related posts

లొంగిపోయిన మావోయిస్టు బెటాలియన్ దళసభ్యుడు

Divitimedia

సీతారామ ప్రాజెక్టు నీరు ఈ ప్రాంతానికి కూడా ఇవ్వాలి

Divitimedia

రేపు “నేషనల్ స్పోర్ట్స్ డే” వేడుకల్లో పాల్గొనండి: డీవైఎస్ఓ

Divitimedia

Leave a Comment