Divitimedia
Andhra PradeshBhadradri KothagudemCrime NewsEducationEntertainmentHyderabadLife StyleNational NewsSpot NewsTelanganaWomenYouth

నాట్యగురువు వరలక్ష్మి కన్నుమూత

నాట్యగురువు వరలక్ష్మి కన్నుమూత

✍️ భద్రాచలం- దివిటీ (జనవరి 6)

భద్రాచలం పట్టణం, పరిసర ప్రాంతాల్లోని పలువురికి నృత్యంలో శిక్షణనిచ్చి, తీర్చి దిద్దిన గురువు ఉప్పులూరి వరలక్ష్మి సోమవారం ఉదయం కన్నుమూశారు. 35సంవత్సరాల క్రితం నుంచి భద్రాచలం ప్రాంతంలో మొట్టమొదటి కూచిపూడి నృత్యకళాకారిణిగా పేరున్న ఆమె మృతి ఈ ప్రాంతంలోని పలువురు శిష్యులను కంటతడి పెట్టించింది. ఈ లోకాన్ని వీడి కళామతల్లి పాదాల చెంతకు చేరిన ఆమె
భద్రాచలం పట్టణంలో ఎందరినో నృత్య కళాకారులుగా తీర్చిదిద్దిన ఘనత సొంతం చేసుకున్నారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో అనేక ప్రాంతాల్లో ఆమె శిష్యబృందం చేత దాదాపు 3వేలకు పైగా నాట్యప్రదర్శనలిచ్చారు. భద్రాచలంలో ప్రతి నృత్యకళాకారులు కూడా ఆమె వద్ద ప్రథమ శిక్షణ తీసుకున్న వారేనని నేటికీ చెప్తుంటారు. అంతటి గొప్ప కళాతపస్వి, భద్రాచలంలో ప్రముఖ రచయితల నుంచి ప్రశంసలందుకున్నారు. అలాంటి కళాకారిణి ఈ లోకాన్ని వీడిపోవడం బాధాకరమని, ఆమె పవిత్రాత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు, శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు, భద్రాచలం పట్టణ ప్పప్రముఖు గాదె మాధవరెడ్డి, తదితరులు ఈ సంధర్భంగా కొనియాడారు.

Related posts

ఐఎన్టీయూసీని నమ్ముకున్న ఏ కార్మికుడికీ నష్టం జరగదు

Divitimedia

వనమహోత్సవ లక్ష్యాలు సాధించాలి

Divitimedia

ఇకనుంచి వాళ్లు కూడా ‘హాఫ్ నిక్కర్లు’ కాదు

Divitimedia

Leave a Comment