Divitimedia
Bhadradri KothagudemBusinessHyderabadKhammamLife StyleNational NewsPoliticsSpot NewsTechnologyTelangana

ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ లను విజిట్ చేసిన ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా

ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలను విజిట్ చేసిన ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జనవరి 4)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అప్పారావుపేట, అశ్వారావుపేటలలో ఆయిల్ పామ్ ప్యాక్టరీలను శనివారం తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి సందర్శించారు. తెలంగాణ ఆయిల్ ఫెడ్ అధికారులతో సందర్శించిన చైర్మన్ రాఘవరెడ్డి ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉమ్మడి ఖమ్మం జిల్లా ‘ఆయిల్ పామ్ హబ్’ గా పేరు గాంచిందని పేర్కొన్నారు. ఇక్కడి అనుభవాలను సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిర్మాణం పూర్తి చేసుకుంటున్న ఆయిల్ పామ్ ప్యాక్టరీ నిర్వహణకు ఉపయోగించుకోవాలని తన వెంట ఉన్న ఆయిల్ ఫెడ్ సిబ్బందికి చైర్మన్ రాఘవ రెడ్డి సూచించారు. అక్కడి సిబ్బందితో మాట్లాడి సమస్యలు ఏమున్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. రైతులకు మేలు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశ్యమన్నారు. అనుభవం ఉన్న వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల సహకారంతో ఆయిల్ పామ్ రైతులకు మెరుగైన లాభాలను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. పక్కనే ఉన్న ఆయిల్ పామ్ నర్సరీని సందర్శించి, ఇన్ ఛార్జికి పలు సూచనలు చేశారు. చైర్మన్ వెంట ఆయిల్ ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి, అధికారులు మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Related posts

కూనేటి గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు

Divitimedia

బాలల స్నేహపూరిత జిల్లాగా మార్చాలి

Divitimedia

ఊరచెరువు అభివృద్ధికి తహసిల్దారును కలిసిన రోటరీబృందం

Divitimedia

Leave a Comment