గ్రూప్-2 పరీక్షా కేంద్రాలు పరిశీలించిన జిల్లా ఎస్పీ
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (డిసెంబరు 15)
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీఎస్పీఎస్సీ) ఆధ్వర్యంలో ఆదివారం మొదలైన గ్రూప్-2 పరీక్షల కేంద్రాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్పీ రోహిత్ రాజు సందర్శించారు. పరీక్షకేంద్రాల వద్ద విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి ఈ సందర్భంగా ఎస్పీ పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షకేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లుగా ఆయన తెలిపారు. కొత్తగూడెం సింగరేణి ఉమెన్స్ కాలేజి, పాల్వంచలో అనుబోస్ ఇంజనీరింగ్ కాలేజి పరీక్షకేంద్రాలను ఎస్పీ సందర్శించి, అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. డీఎస్పీలు సతీష్ కుమార్, రెహమాన్, సీఐలు, ఎస్సైలు ఆయన వెంట పర్యటించారు.