వైద్యఖర్చుల కోసం నేస్తం ట్రస్ట్ సాయం
✍️ బూర్గంపాడు – దివిటీ (డిసెంబరు 11)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోరంపల్లి బంజర గ్రామానికి చెందిన నేస్తం వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ముసలిమడుగు గ్రామానికి చెందిన పెరుమాళ్ల ముత్తయ్య అనే వ్యక్తికి వైద్య ఖర్చుల కోసం బుధవారం రూ.8000 సాయం అందించారు. సారపాకలోని ఐటీసీ పేపర్ పరిశ్రమలో క్యాజువల్ కార్మికుడిగా పనిచేస్తున్న ముత్తయ్య లివర్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. నాలుగు సంవత్సరాల నుంచి అతని తల్లి కూడా పెరాలసిస్ వచ్చి మంచానికే పరిమితమైన నేపథ్యంలో ఆమె వైద్య ఖర్చుల కోసమే ఇబ్బంది పడుతున్నారు. భార్య, కూతురు, తల్లిదండ్రులను పోషించుకోవాల్సిన పరిస్థితుల్లో వచ్చిన అనారోగ్యం కారణంగా ముత్తయ్య కుటుంబం ఇబ్బందులు పడుతోంది. ఈ పరిస్థితుల్లో అతని భార్య సునీత సాయం కోసం నేస్తం ట్రస్టును సంప్రదించారు. ఈ మేరకు బుదవారం రూ.8000 సాయం అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఛైర్మన్ బత్తుల రామకొండారెడ్డి, సెక్రటరీ ఇండ్ల రాజేష్, కోశాధికారి కైపు రాజేందర్ రెడ్డి, సభ్యులు బత్తుల రామకొండారెడ్డి (సొసైటీ డైరెక్టర్) సంకా సురేష్, కైపు రమేష్ రెడ్డి , అవుల నాగార్జున, డి బాలనారాయణరెడ్డి, గ్రామస్తుడు జి.రవి పాల్గొన్నారు.