ఊరచెరువును అభివృద్ధి చేస్తాం, అనుమతించండి
కలెక్టరుకు వినతిపత్రం సమర్పించిన రోటరీ ఇంటర్నేషనల్ బృందం
✍️ బూర్గంపాడు – దివిటీ (నవంబరు 29)
బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలురెడ్డిపాలెంలోని ఊరచెరువును రోటరీక్లబ్ నుంచిఅభివృద్ధి చేస్తామని, అనుమతివ్వాలని రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్-3150 మాజీ గవర్నర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో క్లబ్ భద్రాచలం ప్రతినిథులు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కలెక్టరుకు వినతిపత్రం అందజేశారు. పూర్తిగా రోటరీ క్లబ్ నిధులతో ఆ చెరువును అభివృద్ధి పరిచేందుకు వివిధ రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్బులు, రోటరీ ఫౌండేషన్ నుంచి రూ.30 లక్షలు సమకూర్చుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న చెరువుకు మూడువైపులా కట్టను పెంచి ప్రస్తుతం సాగుచేసుకుంటున్న ఆ రైతులకు ఆయకట్టు పెంచడంతోపాటు, మినీ ట్యాంక్ బండ్ ను తలపించేలా సుందరీకరణ చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వారు పేర్కొన్నారు. రోటరీక్లబ్ నిధులతో”ఊరచెరువు” అభివృద్ధి పరుచదలచుకున్నందున, పనులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని కోరారు. రోటరీ ఫౌండేషన్ ల నిధులు సిద్ధంగా ఉన్నందున చెరువు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ చేతుల మీదుగా శంకుస్థాపనకోసం నిర్ణయించినట్లు రోటరీ ప్రతినిథులు వివరించారు.జిల్లా కలెక్టర్ సూచనలు, ఆదేశాల మేరకు “ఊరచెరువు”ను మినీ ట్యాంక్ బండ్ మాదిరిగా గ్రీనరీ, లైటింగ్, వాకింగ్ ట్రాక్, యువత ఆహ్లాదకరంగా విహరించడానికి పెడల్ బోటింగ్, తదితర హంగులతో సుందరీకరణ చేసేందుకు నిర్ణయించినట్లు రోటరీడిస్టిక్ట్-3150(తెలంగాణ రాష్ట్రం, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధి) తాజా మాజీ గవర్నర్ డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి తెలియచేశారు. జిల్లా కలెక్టరును కలిసినవారిలో డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి, మాజీ గవర్నర్ జామున్లముడి అబ్రహాం, రోటరీక్లబ్ ఆఫ్ రివర్ సైడ్- భద్రాచలం అధ్యక్షుడు డాక్టర్ మడిపెద్ది రమేష్ బాబు, కోశాధికారి ధనశెట్టి రాఘవయ్య ఉన్నారు.