ఉత్సాహంగా దివ్యాంగుల జిల్లాస్థాయి ఆటల పోటీలు
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (నవంబరు 20)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో బుధవారం దివ్యాంగుల జిల్లాస్థాయి ఆటల పోటీలు స్థానిక ప్రగతిమైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ లూయిస్ బ్రెయిల్లీ, స్టీఫెన్ హాకింగ్ వంటి వారితోపాటు పారా ఒలంపిక్స్ లో గెలుపొందిన వారిని స్ఫూర్తిగా తీసుకొని అన్ని రంగాల్లో జిల్లాను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందేలా కృషి చేస్తానని, జిల్లా స్థాయిలో గెలుపొందినవారు రాష్ట్రస్థాయిలో జరగనున్న పోటీల్లో కూడా పథకాలు సాధించాలని ఆకాంక్షించారు. రన్నింగ్, చెస్, షార్ట్ పుట్, క్యారమ్స్, ట్రై సైకిల్ రేస్ వంటి ఆటల పోటీల్లో పాల్గొని, దివ్యాంగులు ప్రతిభ ప్రదర్శించారు. మొదటిస్థానంలో నిలిచినవారిలో శారీరక దివ్యాంగుల్లో శృతి, నాగేంద్రబాబు, శైలజ, ఖాసిం, దీపిక, అంధులలో సందీప్, వైశాలి, నరేందర్, రమణయ్య, నంద కిషోర్, బధిరులలో సాయికౌశిక్, అనిత, అన్నపూర్ణ, సాగర్, శ్రావణ్, మానసిక దివ్యాంగులలో రవీందర్, సమతాశ్రీ, ముష్కాన్, నారాయణ , వైష్ణవి గెలుపొందగా, వారికి మెడల్స్ ప్రధానం చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలతలెనినా, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, ప్రసాద్, క్రిసోలిక్, కృష్ణవేణి, వికాసం స్కూల్ సిబ్బంది అరుణ, దివ్యాంగుల అసోసియేషన్స్ సభ్యులు జి.సతీష్, రమణయ్య, రామలింగారెడ్డి, ఫిజికల్ డైరెక్టర్లు సుధీర్, లక్ష్మయ్య, మంజిలాల్, కనక దుర్గ, సంతోష్, స్పెషల్ స్కూల్స్ టీచర్లు, విద్యార్థులు, హబ్ స్టాఫ్ రూప, సాహితి, మౌనిక, స్వాతి, ఐసీపిఎస్ స్టాఫ్ సందీప్, రంజిత్, నాగరాజు, కార్యాలయ సిబ్బంది వరప్రసాద్, నాగేశ్వర రావు, నరేష్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.