Divitimedia
HanamakondaHyderabadLife StyleNational NewsPoliticsSpot NewsTechnologyTelanganaTravel And TourismWarangal

కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

✍️ వరంగల్ – దివిటీ (నవంబరు 19)

వరంగల్ నగరంలో నిర్మించిన కాళోజీకళాక్షేత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ప్రజలకు అంకితం చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆ కళాక్షేత్రానికి ప్రారంభోత్సవం చేశారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు విగ్రహాన్ని సీఎం ఈ సందర్భంగా ఆవిష్కరించారు. కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కాళోజీ నారాయణరావు జీవిత విశేషాలతో కూడిన ఫోటో గ్యాలరీని, అక్కడ తొలిప్రదర్శనగా వారి జీవితంలోని ఘట్టాలను గుర్తుచేస్తూ రూపొందించిన లఘుచిత్రాన్ని వీక్షించారు. డిజిటల్ పద్ధతిలో అక్కడి నుంచే వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

యూఆర్ఎస్’ను సందర్శించిన ఎంఈఓ

Divitimedia

బాధ్యతలు స్వీకరించిన జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి శ్రీరామ్

Divitimedia

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఘోర రైలు ప్రమాదం

Divitimedia

Leave a Comment