దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయి ఆటలపోటీలు
✍️ కొత్తగూడెం – దివిటీ (నవంబరు 18)
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా
జిల్లాలోని దివ్యాంగులకు ఈ నెల 20న కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయిలో ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలతలెనినా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఆటల పోటీలలో పాల్గొనే దివ్యాంగులు జూనియర్ విభాగంలో (10-17 సంవత్సరాలు) సీనియర్ విభాగంలో (18-54 సంవత్సరాలు) రన్నింగ్, షాట్పుట్, చెస్ పోటీలు బాల బాలికలకు విడివిడిగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆటలలో స్పెషల్ స్కూల్ పిల్లలు, దివ్యాంగులు పాల్గొని పోటీలను దిగ్విజయం చేయాలని ఆమె కోరారు. జిల్లా స్థాయిలో మొదటిస్థానం సాధించినవారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని ఆమె వెల్లడించారు. వివరాల కోసం 6301981960 నెంబర్లో సంప్రదించాలని ఆమె కోరారు.