రూ.2.48 కోట్ల విలువైన 993 కిలోల గంజాయి దహనం
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (నవంబరు 18)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, ఇల్లందు , అశ్వారావుపేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుబడిన రూ.2.48 కోట్ల విలువైన 993 కిలోల గంజాయిని సోమవారం ఆ శాఖాధికారులు దహనం చేశారు. మొత్తం 54 కేసులలో పట్టుబడిన ఆ గంజాయిని ఖమ్మం ఎక్సైజ్ డిప్యూటి కమిషనర్ (డీసీ) జనార్థన్ రెడ్డి అదేశాల మేరకు దహనం చేసినట్లు ఆ శాఖాధికారులు ప్రకటించారు. ఆ గంజాయి విలువ రూ. 2,48,25,000 ఉంటుందని అంచనా వేసినట్లు వారు అధికారులు వెల్లడించారు. తల్లాడ మండల పరిధిలోని గోపాల్‌పేట్ గ్రామంలో ఉన్న దహనవాటికలో గంజాయి దగ్ధం చేశారు. కొత్తగూడెం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో 25 కేసుల్లోని 337.790 కిలోలు, పాల్వంచ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో 15 కేసుల్లోని 408.371 కిలోలు, మణుగూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో 2 కేసుల్లోని 52.520 కిలోలు,
ఇల్లందు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో 10కేసుల్లోని 108.372 కిలోలు, ఆశ్వారావుపేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో 2కేసుల్లోని 37.500 కిలోల గంజాయిని కలిపి దహనం చేయించినట్లు డిప్యూటి కమిషనర్ తెలిపారు.
గంజాయి దహనం చేయించిన కార్యక్రమంలో డిప్యూటి కమిషనర్ జనార్థన్‌రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ గణేష్, ఎక్సైజ్ సూపరిండెంట్ జానయ్యతోపాటు ఆ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల సీఐలు పాల్గొన్నారు.