ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (నవంబరు 13)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం పరిధిలోని గుంపెన గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు బుధవారం సందర్శించారు. కొనుగోలు ప్రక్రియ గురించి అక్కడి అధికారులనడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రం వద్దనున్న రైతులతో మాట్లాడిన ఎస్పీ, వారి సమస్యలు తెలుసుకొని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని మాయమాటలు చెప్పే దళారులకు అమ్మి మోసపోవద్దని ఎస్పే సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, ఎస్బీ ఇన్స్పెక్టర్ నాగరాజు, అన్నపురెడ్డిపల్లి ఎస్సై చంద్రశేఖర్, చంద్రుగొండ ఎస్సై స్వప్న, తదితరులు పాల్గొన్నారు.