పట్టుబడిన రూ.1.87 కోట్ల విలువ చేసే గంజాయి దహనం
భద్రాచలం ఎక్సైజ్ పోలీసులకు ఈఈడీ అభినందనలు
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (నవంబరు 6)
భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 34 కేసుల్లో పట్టుబడిన రూ.1.87 కోట్ల విలువ చేసే 750 కిలోల గంజాయిని బుధవారం దహనం చేశారు. ఖమ్మంజిల్లా తల్లాడ మండల పరిధిలోని గోపాల్‌పేట్ గ్రామంలోనున్న ప్రభుత్వ అనుమతి పొందిన ఏడబ్ల్యుఎం కన్సటింగ్ లిమిటెడ్ దహన కేంద్రంలో ఆ గంజాయి దగ్ధం చేశారు.
ఎక్సైజ్ శాఖ ఖమ్మం డిప్యూటీ కమిషనర్ జనార్థన్‌రెడ్డి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ గణేష్, భద్రాది కొత్తగూడెం జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానయ్య, భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐ రహీమున్నీషా, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. పెద్దమొత్తంలో గంజాయిని నిర్మూలించిన అధికారులు, సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి అభినందించారు.