గిరిజన మహిళా డిగ్రీకళాశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (నవంబరు 2)
కొత్తగూడెం నెహ్రూనగర్ లోని గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీకళాశాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ జితేష్ వి.పాటిల్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా గురుకుల వసతిగృహంలో సౌకర్యాలు, సమస్యలను విద్యార్థినులనడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నారా? లేదా? ఆరా తీశారు. నిబంధనల ప్రకారం విద్యార్థులకు అందించాల్సిన ఆహారం, విద్యా సామగ్రి, తదితర సౌకర్యాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకుంటూ వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కళాశాల ప్రిన్సిపల్ అనురాధను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినులకు కావలసిన మెరుగైన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. రాబోయే న్యాక్(NAAC) అక్రిడిటేషన్ కోసం, విద్యార్థులు ఉన్నత భవిష్యత్తుకు ప్రణాళికలు ఏ విధంగా నిర్మించుకోవాలనే అంశాలపై విద్యార్థులు, సిబ్బందికి సూచనలు చేశారు. ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని సూచించారు. బాగా చదివి ఉన్నతస్థానాలకెదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, సిబ్బంది పాల్గొన్నారు.