Divitimedia
Bhadradri KothagudemEducationLife StyleSpot NewsYouth

రెసిడెన్షియల్ స్కూలులో దీపావళి జరిపిన ఎంఈఓ

రెసిడెన్షియల్ స్కూలులో దీపావళి జరిపిన ఎంఈఓ

✍️ కొత్తగూడెం – దివిటీ (నవంబరు 1)

పాత కొత్తగూడెంలో ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహించే అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులతో తమ కుటుంబసభ్యులతో కలిసి కొత్తగూడెం ఎంఈఓ డాక్టర్. ప్రభుదయాల్ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ పాఠశాలలో నిరుపేద పిల్లలు, వీధిబాలురు, పాక్షికంగా అనాథలైన, బడి మానేసి బయట తిరుగుతున్న బాలల కోసం రెసిడెన్షియల్ బోధన చేస్తున్నారు. ఆ చిన్నారుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా నిర్వహించబడుతున్న ఈ పాఠశాలలో దీపావళి పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాలలకు స్వీట్లు, సబ్బులు పంపిణీ చేసిన అనంతరం మండల విద్యాశాఖాధికారి ప్రభుదయాల్ కుటుంబ సభ్యులు వారితో కలిసి బాణసంచా కాల్చి దీపావళి సంబరంగా జరుపుకున్నారు. కార్యక్రమాన్ని ఆస్వాదించిన విద్యార్థులు ఆనందపడ్డారు.

Related posts

భద్రాచలంలో అంతర్రాష్ట్ర సరిహద్దు అధికారుల సమావేశం

Divitimedia

విద్యాలయాల్లో అన్ని సౌకర్యాలు మెరుగుపరచాలి

Divitimedia

ఉత్సాహంగా సీఎం కప్ క్రీడాపోటీలు

Divitimedia

Leave a Comment