“మన కలపరాజులు” పుస్తకం ఆవిష్కరించిన మంత్రి తుమ్మల
✍️ కొత్తగూడెం – దివిటీ (సెప్టెంబరు 17)
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కొత్తగూడెంలో ఏర్పాటు నిర్వహించిన జిల్లాస్థాయి వ్యవసాయ ఎగ్జిబిషన్ లో “మన కలపరాజులు” పుస్తకాన్ని మంగళవారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్, ఇల్లందు, భద్రాచలం, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావు, జారె ఆదినారాయణ, జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జీకేఎఫ్ ఆగ్రో ఫారెస్ట్రీ-భద్రాచలం సంస్థ ఏర్పాటుచేసిన స్టాల్ సందర్శించిన మంత్రి, రైతులు, పర్యావరణం పట్ల తమ సంస్థ చేస్తున్న కార్యక్రమాలను సంస్థ ప్రతినిధులు వివరించగా, ఆసక్తితో వినడంతోపాటు మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఇదే సందర్భంలో ఎస్కేయం పాషా రూపొందించిన “మన కలపరాజులు” పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ పుస్తకం యొక్క సారాంశం, ముఖ్య విషయాల గురించి తెలుసుకుని, ప్రతి రైతుకు ఉపయోగపడే పుస్తకంగా అభివర్ణించారు. జీకేఎఫ్ సంస్థ రైతులు, పర్యావరణం పట్ల మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు అందించాలని ఆయన జిల్లా యంత్రాంగాన్ని కోరారు. పుస్తకావిష్కరణలో సంస్థ ప్రతినిధులు రజియా, లలిత, సరస్వతి, సౌమ్య, మనోజ్ కుమార్, రవితేజ, రాజు, గపూర్ పాల్గొన్నారు.