కమ్యూనిస్టులే పోరాటస్పూర్తి కొనసాగించాలి
✍️ బూర్గంపాడు – దివిటీ (సెప్టెంబరు 17)
సాయుధ తెలంగాణ పోరాటస్పూర్తిని కమ్యూనిస్టులే కొనసాగించాలని సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు కోరారు. మంగళవారం సారపాక సిపిఎం కార్యాలయంలో అబిదా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరులకు, చిట్యాల ఐలమ్మ ఫోటోకి సీనియర్ నాయకుడు వై అప్పారావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వీర తెలంగాణ సాయుధ పోరాటంలో మరణించిన 4000 మంది అమరవీరులకు జోహార్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కనకం వెంకటేశ్వర్లు, ఆదురి నరసింహారావు, బోళ్ల ధర్మ, మోహన్, సతీష్, వీరన్న, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.