Divitimedia
Bhadradri KothagudemEntertainmentLife StyleSpot NewsTelangana

భగవాన్ దాస్ కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ అన్నప్రసాద వితరణ

భగవాన్ దాస్ కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ అన్నప్రసాద వితరణ

✍️ భద్రాచలం – దివిటీ (సెప్టెంబరు 14)

భద్రాచలం పట్టణంలోని భగవాన్ దాస్ కాలనీలో గణేశ్ ఉత్సవాలలో భాగంగా శ్రీరామ గణేశ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శనివారం అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖుడు, సంఘసేవకుడు, అబ్దుల్ కలాం అవార్డుగ్రహీత గాదె మాధవరెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అన్నారు. యువకులు ప్రతి ఏటా గణేశ్ ఉత్సవాలు నిర్వహించడం సంతోషం అన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు వెయ్యిమంది పాల్గొని అన్నప్రసాదం స్వీకరించినందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Related posts

భూమాత మాడ్యూల్లో సమస్యలు, పరిష్కారాలపై నివేదించాలి

Divitimedia

ఏకంగా రూ.5లక్షల లంచంతో…

Divitimedia

జాబ్ మేళాలు సద్వినియోగం చేసుకోండి

Divitimedia

Leave a Comment