Divitimedia
EducationHealthHyderabadLife StyleSpot NewsTelanganaWomen

పదకొండుమంది సీడీపీఓలకు అసిస్టెంట్ డైరెక్టర్లుగా ప్రమోషన్స్

పదకొండుమంది సీడీపీఓలకు అసిస్టెంట్ డైరెక్టర్లుగా ప్రమోషన్స్

✍️ హైదరాబాద్ – దివిటీ (సెప్టెంబరు 13)

తెలంగాణ స్త్రీ, శిశు సంక్షేమశాఖలో పదకొండుమంది సీడీపీఓలకు అసిస్టెంట్ డైరెక్టర్లుగా ప్రమోషన్స్ ఇచ్చారు. ఈ మేరకు ఆ శాఖ రాష్ట్ర సెక్రటరీ వాకాటి కరుణ ఉత్తర్వులు విడుదల చేశారు. గురువారం సాయంత్రం విడుదల చేసిన ఈ ఉత్తర్వులలో పది మందిని వివిధ జిల్లాల్లో, మరొకరిని ఆ శాఖ డైరెక్టర్ కార్యాలయంలో డీడబ్ల్యుఓలుగా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. వి.జ్యోతి రాష్ట్ర డైరెక్టర్ కార్యాలయంలో డీడబ్ల్యుఓ హోదాలో విధుల్లో నియమించారు. జె.ఎం. స్వర్ణలతలెనినా ఖమ్మం జిల్లా, ఎం.ధనమ్మ కుమ్రంభీమ్ అసిఫాబాద్ జిల్లా, ఎం.సరస్వతి కరీంనగర్ జిల్లా, జె.హైమావతి మెదక్ జిల్లా, బి.రాజమణి వరంగల్ జిల్లా, ఎ.ప్రమీల హనుమకొండ జిల్లా, జె.జయతి కామారెడ్డి జిల్లా సంక్షేమాధికారులుగా నియమితులయ్యారు. డి.సునంద జోగులాంబగద్వాల జిల్లా, కె.నరసింహరావు యాదాద్రిభువనగిరి జిల్లా, బి.కృష్ణవేణి వికారాబాద్ జిల్లా సంక్షేమాధికారులుగా నియమితులయ్యారు.

Related posts

అమరారం గ్రామపంచాయతీలో ఎమ్మెల్యే సమీక్ష

Divitimedia

అతుకులబొంతలు… అక్కడక్కడా వదిలేసిన గుంతలు…

Divitimedia

పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలి : డిఐజి(ఎస్ఐబి) సుమతి

Divitimedia

Leave a Comment