డాక్టర్ విజేందర్రావుకు రోటరీ నేతల ఘన నివాళి
✍️ కొత్తగూడెం – దివిటీ (సెప్టెంబరు 12)
కొత్తగూడెం పట్టణానికి చెందిన ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు, రోటరీ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ డాక్టర్.విజేందర్ రావు మృతికి రోటరీ ఇంటర్నేషనల్ పూర్వ గవర్నర్లు, పలువురు ప్రతినిధులు సంతాపం ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఆయన పార్థివ దేహం వద్ద ఘనంగా నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా వైద్య, సేవారంగాల్లో డాక్టర్.విజేందర్ రావు సేవలను స్మరించుకుని, కొనియాడారు. ఆయనకు నివాళులర్పించిన వారిలో రెండు తెలుగు రాష్ట్రాల రోటరీక్లబ్ డిస్ట్రిక్ట్-3150 మాజీ గవర్నర్లు డా.బుూసిరెడ్డి శంకర్ రెడ్డి, డీకే ఆనంద్, జామున్లమూడి అబ్రహం, రోటరీక్లబ్ ప్రతినిధులు హరిహరప్రసాద్, గుడికందుల నాగేశ్వరరావు, వీసం వసంతరావు తదితరులున్నారు.