Divitimedia
Bhadradri KothagudemEducationLife StyleSpot NewsTelanganaYouth

‘డీఐఈఓ’గా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వరరావు

‘డీఐఈఓ’గా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వరరావు

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (ఆగస్టు 7)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారిగా భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ హెచ్.వెంకటేశ్వరరావు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఆయనను ఇక్కడ డీఐఈఓగా నియమిస్తూ, తెలంగాణ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శృతి ఓజా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం హెచ్.వెంకటేశ్వరరావు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఈ పోస్టులో కొనసాగిన సులోచనరాణి ‘రిలీవ్’ అయ్యారు. జిల్లా ఇంటర్మీడియట్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

Related posts

డ్వాక్రా మహిళలే యజమానులుగా తృప్తి క్యాంటీన్లు

Divitimedia

రిటైర్డ్ ఐఏఎస్ శివశంకర్ ఛైర్మన్ గా తెలంగాణ పీఆర్సీ నియామకం

Divitimedia

కాంగ్రెస్ పార్టీ లీడర్ రివ్యూకు హాజరైన అధికారులు?

Divitimedia

Leave a Comment