గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్ట్
4.9కిలోల గంజాయి, బైక్, మొబైల్ ఫోన్ సీజ్
✍️ కొత్తగూడెం – దివిటీ (జులై 12)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డొంకరాయి పరిసర ప్రాంతాల నుంచి కొత్తగూడెం టూ టౌన్ పరిధిలోని రుద్రంపూర్ కు నిషేధిత గంజాయిని ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న ముగ్గురు నిందితులను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం… రుద్రంపూర్ తండాకు చెందిన బోడ శివ, జూలూరుపాడు మండలానికి చెందిన వనమాల వేణు, మరొక మైనర్ ను రామవరం ఎస్సీబీనగర్ గోధుమ వాగు బ్రిడ్జి వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1,21,325 విలువగల 4.9కిలోల గంజాయి, ఒక బజాజ్ పల్సర్ వాహనం, ఒక సెల్ ఫోన్ ను సీజ్ చేసినట్లు సీఐ రమేష్ తెలిపారు.