Divitimedia
Bhadradri KothagudemCrime NewsHealthLife StyleSpot NewsTelanganaYouth

ఆదీవాసీల సంక్షేమమే ప్రధానలక్ష్యం

భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు

✍️ ఛర్ల – దివిటీ (జులై 11)

ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజల సంక్షేమం కోసం జిల్లా పోలీసుశాఖ తరపున ఎల్లప్పుడూ కృషి చేస్తున్నామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. చర్ల మండల పరిధిలోని మావోయిస్టు ప్రభావిత గ్రామాలైన చెన్నాపురం, ఎర్రంపాడు, బత్తిన పల్లి, బట్టిగూడెం ఆదీవాసీ ప్రజలకు చర్ల పోలీసుల ఆధ్వర్యంలో గురువారం ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించారు. ఎర్రంపాడు, బత్తినపల్లి,బట్టిగూడెం గ్రామస్తులకు ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేసి, వారిని చెన్నాపురం తరలించారు. చెన్నాపురంలో ఏర్పాటు చేసిన ఈ వైద్యశిబిరాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రారంభించారు. దాదాపు 150 కుటుంబాలకు నిపుణులైన వైద్యులతో వైద్య చికిత్సలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. చిన్న పిల్లలకు దుస్తులు, బిస్కెట్ ప్యాకెట్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంచారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని ఏజెన్సీ ఆదివాసీ ప్రజల సంక్షేమానికి చేస్తున్న కృషిలో భాగంగా తెలంగాణ-చత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దు గ్రామాలలోని ఆదీవాసీల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. వర్షపు నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు అధికమై మలేరియా, డెంగ్యూ లాంటి విషజ్వరాలు ప్రబలే ప్రమాదముంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చెన్నాపురంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన ఎస్పీ, అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు. నిషేధిత సిపిఐ మావోయిస్టులు తమ మనుగడ కోసం ఆదివాసీ ప్రాంతాలు అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటున్నారన్నారు. అతి త్వరలోనే చెన్నాపురం, పూసుగుప్ప గ్రామాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రారంభిస్తామని తెలిపారు. అభివృద్ధి నిరోధకులుగా మారిన నిషేధిత మావోయిస్టులకు సహకరించవద్దని, మావోయిస్టుల గురించి ఏదైనా తెలిస్తే వెంటనే పోలీసువారికి సమాచారమందించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెడికల్ క్యాంపునకు సహకరించిన వైద్య బృందానికి, చర్ల పోలీస్ అధికారులకు ఈ సందర్భంగా ఎస్పీ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ అంకిత్ కుమార్ సంక్వార్, చర్ల సీఐ రాజువర్మ, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సైలు నర్సిరెడ్డి, పీవిఎన్ రావు, చర్ల వైద్యుడు సాయివర్ధన్, పీడియాట్రిక్ వైద్యుడు విజయారావు, జనరల్ ఫిజీషియన్స్ డాక్టర్స్ లోకేష్, దివ్య, గైనకాలజీ వైద్యురాలు శ్రీక్రాంతి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఛత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దు గ్రామాలైన ఉంజుపల్లి, పూసగుప్పలోని సీఆర్పీఎఫ్ క్యాంపులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సందర్శించారు. విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు. నిషేధిత మావోయిస్టుల కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ రెండు క్యాంపులలో జరుగుతున్న కొన్ని నిర్మాణ పనులను పరిశీలించారు. అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకుని, వాటిని పరిష్కరిస్తామన్నారు.

Related posts

మహిళగానైనా మంత్రి స్పందించి ఉంటే బాగుండేది

Divitimedia

అక్కడ మద్యం తాగొద్దన్నందుకు నలుగురిని చంపారు…

Divitimedia

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఘోర రైలు ప్రమాదం

Divitimedia

Leave a Comment