Divitimedia
Bhadradri KothagudemCrime NewsEducationLife StyleSpot NewsTelanganaYouth

ఆపరేషన్ ముస్కాన్-10 పోస్టర్ ఆవిష్కరించిన ఎస్పీ రోహిత్ రాజు

ఆపరేషన్ ముస్కాన్-10 పోస్టర్ ఆవిష్కరించిన ఎస్పీ రోహిత్ రాజు

బాలకార్మికుల వివరాలు తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వండి

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాధ్యతగా వ్యవహారించాలి

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జులై 2)

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ పదవ విడత కార్యక్రమం జూలై 1 నుంచి 31 వరకు జిల్లాలో పటిష్ట ప్రణాళికతో అమలు చేస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్-10 అధికారులు, సిబ్బందితో కలిసి తన కార్యాలయంలో ఆయన పోస్టర్ ఆవిష్కరించారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి సబ్ డివిజన్ పరిధిలో ఓ ఎస్ఐ, నలుగురు సిబ్బందిని ఒక బృందంగా నియమించినట్లు తెలిపారు. పోలీసు శాఖ, ఇతర శాఖల అధికారులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించాలన్నారు. జిల్లావ్యాప్తంగా 5 ప్రత్యేక బృందాలు ఈ నెలరోజులు బాలకార్మికులను గుర్తించడానికి దాడులు నిర్వహిస్తారని తెలియజేశారు. ఎక్కడైనా బాలకార్మికులను గుర్తిస్తే వెంటనే 1098 గానీ డయల్-100కు గానీ స్థానిక పోలీసు అధికారులకు గానీ సమాచారం అందించాలని ఈ సందర్బంగా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆపరేషన్ ముస్కాన్-10 కి జిల్లా నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్న కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, వివిధ డిపార్ట్మెంట్ల అధికారులతో ఐఎంఏ ఫంక్షన్ హాలులో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో హాట్ స్పాట్స్ ను గుర్తించి అక్కడ ప్రత్యేకంగా నిఘా ఉంచాలని ఈ సందర్బంగా డీఎస్పీ రెహమాన్ ముస్కాన్ బృందాలకు సూచించారు. గతంలో ఆపరేషన్ ముస్కాన్ ద్వారా రక్షించిన పిల్లల ప్రస్తుత పరిస్థితి తెలుసుకోవాలన్నారు. బడికి వెళ్లకుండా చదువు మానేసి పనులు చేస్తున్న పిల్లలను గుర్తించి వారిని మరలా స్కూల్లో చేర్పించి విద్యావంతులుగా తీర్చిదిద్దాలని తెలిపారు. కిరాణా షాపులు, మెకానిక్ షాపులు, హోటళ్లు, ఇటుక బట్టీలు, పౌల్ట్రీ ఫామ్స్, రోడ్డుపై భిక్షాటన చేస్తున్న పిల్లలు, ఇతర ప్రదేశాలలో తప్పిపోయిన, వదిలివేయబడిన పిల్లలు బాలకార్మికులుగా పని చేస్తున్నట్లయితే అలాంటి వారిని గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి వారికి అప్పగించడం గానీ సంరక్షణగృహాలకు తరలించేలా గానీ చర్యలు తీసుకోవాలన్నారు. చిన్నపిల్లలతో ఎవరైనా బలవంతంగా బిక్షాటన, వెట్టిచాకిరీ చేయిస్తున్నట్లు దృష్టికి వస్తే వెంటనే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో డీసీఆర్బీ సీఐ శ్రీనివాస్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ నాగరాజురెడ్డి, విద్యాశాఖ అధికారి అన్నామని, లేబర్ డిపార్ట్మెంట్ నుంచి షర్ఫుద్దీన్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు సుమిత్రాదేవి, సాధిక్ పాషా, ఐసీడీఎస్ అధికారి శివకుమారి, చైల్డ్ హెల్ప్ లైన్ కో-ఆర్డినేటర్ సందీప్, ఎస్సైలు రమాదేవి, విజయలక్ష్మి, రవి, తిరుపతి, సోమేశ్వర్, ఏసోబు, శ్రీనివాస్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ఆత్మహత్యకు యత్నించిన వృద్ధురాలిని కాపాడిన బ్లూకోల్ట్స్ పోలీసులు

Divitimedia

భారీగా ఇసుక సీజ్ చేసిన రెవెన్యూశాఖ

Divitimedia

జాతీయ రహదారుల నిర్మాణాలు గడువులోగా పూర్తి చేయాలి

Divitimedia

Leave a Comment