రామచంద్రయ్య మృతికి మంత్రి పొంగులేటి సంతాపం
✍️ ఖమ్మం – దివిటీ (జూన్ 23)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలానికి చెందిన పద్మశ్రీ అవార్డ్ గ్రహీత “సకిని రామచంద్రయ్య” అనారోగ్యంతో వారి స్వగృహంలో ఆదివారం మృతి చెందడం పట్ల తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచారశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. రామచంద్రయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.