Divitimedia
EducationHealthHyderabadInternational NewsLife StyleNational NewsSpot NewsTelanganaYouth

యూపెస్సీ ర్యాంకర్ల ఆధ్వర్యంలో ‘స్పూర్తి’ కార్యక్రమం

యూపెస్సీ ర్యాంకర్ల ఆధ్వర్యంలో ‘స్పూర్తి’ కార్యక్రమం

100మంది పేద బాలికలకు ‘సుకన్య సమృద్ధి ఖాతాలు’

✍️ దివిటీ – హైదరాబాదు (జూన్ 22)

పేద బాలికలకు చేయూతనందించే లక్ష్యంతో భారత తపాలా శాఖ ఆధ్వర్యంలో శనివారం “స్ఫూర్తి” అనే కార్యక్రమం ద్వారా హైదరాబాదులో 100 మంది పేద బాలికలకు “సుకన్య సమృద్ధి ఖాతా” లను తెరిచారు. జామా-ఐ-ఉస్మానియా పోస్ట్ ఆఫీసులో పోస్ట్ మాస్టర్ జనరల్ టి.ఎం.శ్రీలత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బృహత్తర కార్యక్రమంలో 64 మంది యూపీఎస్సీ- 2024 ర్యాంకర్లు పాల్గొని, ఆ 100 మంది బాలికలకు ఖాతాలను తెరిచేందుకు ఆర్థికంగా చేయూతనిచ్చారు. తద్వారా ఆ బాలికల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేశారు. ఈ కార్యక్రమానికి ఐఆర్ఎస్ అధికారులు ఎస్ నరసింహారెడ్డి, రామిరెడ్డి, అనురాగ్ సింగ్ అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సుకన్య సమృద్ధి ఖాతాలతోపాటు ఆ బాలికల తల్లిదండ్రులు, సంరక్షకులకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు డిజిటల్ అకౌంట్లు కూడా తెరిచారు. ఈ కార్యక్రమంలో హెడ్ క్వార్టర్స్ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ టి.ఎం. శ్రీలత మాట్లాడుతూ, సుకన్య సమృద్ధి యోజన ఖాతా లను “భేటీ బచావో-భేటీ పఢావో” నినాదంలో భాగంగా, బాలికల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలనే లక్ష్యంతో 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. ఆనాటి నుంచి ఏప్రిల్-2024 వరకు దేశ వ్యాప్తంగా 3,89,24,105 ఖాతాలు తెరవగా, అందులో కేవలం పోస్టాఫీస్ లలో దేశవ్యాప్తంగా 3,24,66,947 ఖాతాలు, తెలంగాణాలో 10,54,062 ఖాతాలు పోస్ట్ ఆఫీస్ నందు తెరవడం ద్వారా ఎంతోమంది బాలికల ఉజ్వల భవిష్యత్ నిర్మాణంలో పాలుపంచుకున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా దేశంలో చాలావరకు భ్రూణహత్యలు తగ్గాయన్నారు. ఈ పథకం ద్వారా లబ్ది పొందిన ఎంతోమంది యువతులు వారి పెళ్లిళ్లకు, వారి చదువులకు సకాలంలో ఆ డబ్బు ఉపయోగించుకుని లబ్దిపొందాన్నారు. ప్రతి ఆడపిల్లకు భవిష్యత్తులో ఆర్ధిక స్వావలంబన కోసం ఈ పథకం ఉపకరిస్తుందని, ప్రతి ఒక్క బాలికకు ఈ ఖాతా తెరవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బాలికలకు ఖాతాలు తెరవడంలో ఆర్థిక సహకారం అందించిన 64మంది యూపెస్సీ ర్యాంకర్లను సత్కరించారు. దాతల (యూపీఎస్సీ ర్యాంకర్ల) చేతుల మీదుగానే బాలికలకు ‘సుకన్య సమృద్ధి ఖాతా పాసు పుస్తకాల’ను అందిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర ట్రైనీ అధికారులు మాట్లాడుతూ, ఇటీవల సివిల్ సర్వీసెస్ కి నియమితులైన వారంతా ఒక బృందంగా ఏర్పడి ఇలాంటి బృహత్తర కార్యక్రమంలో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందని, ఇప్పుడు తెరిచిన ఖాతాలు కొనసాగేలా చూడాలని బాలికల తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో,బాలికలు, దాతలతోపాటు హైదరాబాద్ సిటీ, హైదరాబాద్ సౌత్ ఈస్ట్, సికింద్రాబాద్ డివిజన్ల పోస్ట్ ఆఫీసెస్ సీనియర్ సూపెరింటెండెట్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, ఆ బాలికల తల్లిదండ్రులు, ఇతర పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

కొట్టివేతలు… దిద్దుబాట్లతో అక్రమాలు కప్పే యత్నం

Divitimedia

నకిలీ విత్తనాలు అరికట్టేందుకు జిల్లాలో ప్రత్యేక నిఘా

Divitimedia

ప్రగతి విజేతలను అభినందించిన బ్రహ్మారెడ్డి

Divitimedia

Leave a Comment