గనులశాఖ అధికారులతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమీక్ష
✍️ న్యూఢిల్లీ – దివిటీ మీడియా (జూన్ 14)
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి గనుల మంత్రిత్వశాఖ, సిపిఎస్‌ఇలు, అనుబంధ కార్యాలయాల సీనియర్ అధికారులతో శుక్రవారం ఢిల్లీలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షలో మరో మంత్రి సతీష్ చంద్ర దూబే కూడా పాల్గొన్నారు.
ఈ సమావేశంలో మంత్రులు మంత్రిత్వ శాఖ పూర్తి వివరాలు, అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో గనులశాఖ ఇప్పటివరకు సాధించిన విజయాలు, దీర్ఘకాలిక ప్రణాళికలపై కూడా చర్చించారు. మైనింగ్ రంగంలో భారత్‌ను స్వావలంబనగా మార్చేందుకు ఆటోమేషన్, ఇన్నోవేషన్, సుస్థిరత, అధునాతన సాంకేతికతలను అమలు చేయడం వంటి కీలకమైన అంశాలపై సమావేశంలో విస్తృత చర్చ సాగింది.