రుణమాఫీపై సీఎం ఉన్నతస్థాయి సమావేశం
✍️ హైదరాబాదు – దివిటీ మీడియా (జూన్ 10)
పంట రుణమాఫీతో పాటు పలు ఇతర అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి, వ్యవసాయ, సహకారశాఖ అధికారులు పాల్గొన్నారు.