Divitimedia
Andhra PradeshDELHIHyderabadInternational NewsLife StyleNational NewsPoliticsTelangana

పీఎం కిసాన్ నిధి విడుదలపై మోడీ తొలిసంతకం

పీఎం కిసాన్ నిధి విడుదలపై మోడీ తొలిసంతకం

✍️ న్యూఢిల్లీ – దివిటీ మీడియా (జూన్ 10)

ఎన్డీఏ కొత్త ప్రభుత్వం తీసుకున్న తొలి నిర్ణయం మేరకు ప్రధాని నరేంద్రమోదీ పీఎం కిసాన్ నిధి విడుదల ఫైలుపై మొదటి సంతకం చేశారు. ఈ మేరకు సోమవారం తొలి సంతకం చేసిన సందర్భంగా ప్రధానమంత్రి మోదీ రైతు సంక్షేమం పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఈ చర్య తెలియజేస్తోందని ప్రకటించారు. ఈ విషయంపై పూర్తిగా కట్టుబడి ఉన్న తమ ప్రభుత్వం, బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంతకంచేసిన మొదటి ఫైల్ రైతు సంక్షేమానికి సంబంధించినది కావడం సముచితమని అభిప్రాయపడ్డారు. రాబోయే కాలంలో రైతు సంక్షేమం, వ్యవసాయ రంగానికి మరింత కృషి చేయాలని తాము కోరుకుంటున్నామని ప్రధాని ప్రకటించారు. 3వ సారి పీఎం కిసాన్ నిధి 17వ విడత విడుదలకు అనుమతిని ఇస్తూ మొదటిఫైల్‌పై సంతకం చేశారు. దీనివల్ల దేశంలో 9.3కోట్ల మంది రైతులకు దాదాపు రూ.20,000 కోట్లు పంపిణీ చేయనున్నారు.

Related posts

పాల్వంచ ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు భేష్

Divitimedia

పందుల్ని కాల్చబోయి పాపను కాల్చి చంపాడు

Divitimedia

పోలీసులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

Divitimedia

Leave a Comment