మణుగూరు మున్సిపాలిటీలో పరిస్థితి అస్తవ్యస్తం
✍️ మణుగూరు – దివిటీ మీడియా (జూన్ 9)
మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి. కొంతకాలంగా ఎన్నికలతో ఉన్నతాధికారులు బిజీబిజీగా ఉంటుండటం, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు, పాలనపై సమీక్షలు చేయలేక పోతుండటం, తదితర కారణాల వల్ల మున్సిపాలిటీలో కూడా పర్యవేక్షణ లోపించినట్లు తెలుస్తోంది. పరిస్థితి తీవ్రతకు అద్దంపట్టేలా మున్సిపల్ సిబ్బంది అధికంగా నివసిస్తున్న సుందరయ్యనగర్ ఏరియాలో డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారడంతో మురుగునీరు వీధుల్లోనే ప్రవహిస్తూ, ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న దుస్థితి నెలకొంది. వర్షం రాకపోయినా ప్రస్తుత వేసవి కాలంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇంక వర్షాలు కురుస్తున్నప్పుడు మరెంత దారుణంగా ఉంటుందోనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు తమ ప్రాంత పరిస్థితులు మెరుగుపర్చాలని సుందరయ్యనగర్ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.