పర్యావరణ స్పూర్తిని చాటిన సింగరేణి సీఎండీ బలరాం
స్వయంగా 235 మొక్కలు నాటిన సీఎండీ బలరాం
✍️ కామిరెడ్డి నాగిరెడ్డి – దివిటీ మీడియా (జూన్ 5)
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఐఆర్ఎస్ అధికారి, సింగరేణి కాలరీస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) పర్యావరణ స్పూర్తిని చాటిచెప్పారు. అత్యున్నత స్థాయి అధికారిగా ఉన్న ఆయన స్థాయిలో ఏ అధికారి అయినా లాంఛనంగా కార్యక్రమం ప్రారంభించి, ప్రసంగించి వెళ్లిపోతుంటారు. కానీ సీఎండీ బలరాం మాత్రం ప్రపంచ పర్యావరణ దినోత్సవ స్పూర్తి చాటుతూ, బుధవారం కొత్తగూడెంలోని ఇల్లందు గెస్ట్ హౌస్ లో 235 మొక్కలను స్వయంగా నాటడం విశేషం. ఇతర అధికారులకు భిన్నంగా టీషర్ట్, షార్ట్ ధరించి స్వయంగా పార చేతబట్టి శ్రమించి మొక్కలు నాటారు. వేల కోట్ల రూపాయల విలువైన సింగరేణి సంస్థకు ఛైర్మన్ అండ్ ఎండీగా ఉన్న ఎన్.బలరాం తానే స్వయంగా మొక్కలు నాటిన విధానం అక్కడకొచ్చిన అధికారులు, ఉద్యోగులు, కార్మికులతోపాటు ఇతర సాధారణ ప్రజలకు కూడా స్పూర్తినిచ్చింది. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని అందరూ పర్యావరణ పరిరక్షణకు తమవంతు కృషి చేయాల్సిన అవసరముందంటూ పలువురు ప్రశంసలవర్షం కురిపించారు.