Divitimedia
Bhadradri KothagudemHyderabadKhammamLife StylePoliticsSpot NewsTelangana

మాదిగల జనసభ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి

మాదిగల జనసభ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి

✍️ దివిటీ మీడియా – హైదరాబాదు (జూన్ 5)

మాదిగల జనసభ పోస్టర్లను రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి.శ్రీనివాసరెడ్డి హైదరాబాదులోని తన నివాసంలో బుధవారం ఆవిష్కరించారు. మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు, తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ తొలి చైర్మన్ డా.పిడమర్తి రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పిడమర్తి.రవి మాట్లాడారు. మాదిగలకు 12శాతం రిజర్వేషన్ సాధనే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో జూన్ 7 నుంచి జరుగుతున్న మాదిగల జనసభలను జయప్రదం చేయాలని మాదిగ జేఏసీ, అనుబంధసంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులను కోరారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వక్కలగడ్డ చంద్రశేఖర్, మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డే యాదయ్య, డా.బి.ఆర్.అంబేద్కర్ సంక్షేమసంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గజ్జెల్లి మల్లిఖార్జున్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

విద్యార్థి అమరవీరుల స్ఫూర్తితో శాస్త్రీయ విద్యా సాధన

Divitimedia

పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి

Divitimedia

అమరారం గ్రామపంచాయతీలో ఎమ్మెల్యే సమీక్ష

Divitimedia

Leave a Comment