Divitimedia
Bhadradri KothagudemCrime NewsLife StyleSpot NewsTelangana

కారు, ఆటో ఢీ ; పలువురికి తీవ్రగాయాలు

కారు, ఆటో ఢీ ; పలువురికి తీవ్రగాయాలు

ఒకరి పరిస్థితి విషమం

✍️ దివిటీ మీడియా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని రంగాపురం గ్రామంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్న ట్లు తెలుస్తోంది. స్థానికుల కథనం ప్రకారం… పాల్వంచ నుంచి వస్తున్న ఆటో, భద్రాచలం వైపు నుంచి వస్తున్న కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటో, కారు తీవ్రంగా దెబ్బతినడం ప్రమాదం తీవ్రత గురించి తెలియజేస్తోంది. ఆటోలోని ప్రయాణికులతోపాటు కారులోని వారికి కూడా తీవ్ర గాయాలైనట్లు స్థానికులు చెప్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత గంటసేపటి వరకు అంబులెన్స్ రాలేదని చెప్తున్నారు. ఓ వ్యక్తి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Related posts

ఏజెన్సీ పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ రోహిత్ రాజు

Divitimedia

లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి : ఎస్పీ రోహిత్ రాజు

Divitimedia

కూటమి అర్థసంవత్సర పాలన అర్థరహితం

Divitimedia

Leave a Comment