Divitimedia
Bhadradri KothagudemCrime NewsHanamakondaHyderabadJayashankar BhupalpallyKhammamLife StyleMahabubabadMuluguNalgondaNational NewsPoliticsSuryapetTechnologyTelangana

రాజకీయ బల్క్ ‘ఎస్ఎంఎస్’ లపై 27వ తేదీ వరకు నిషేధం

రాజకీయ బల్క్ ‘ఎస్ఎంఎస్’ లపై 27వ తేదీ వరకు నిషేధం

✍️ భద్రాద్రి కొత్తగూడెం- దివిటీ మీడియా (మే 24)

వరంగల్ -ఖమ్మం -నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నికల పోలింగ్ సందర్భంగా మే నెల 25 వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు రాజకీయ పరమైన బల్క్ ఎస్ఎంఎస్ ల పై నిషేధం ఉంటుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంకఅల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ఎన్నికలసంఘం జారీ చేసిన ఆదేశాల మేరకు శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఉపఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసే 48 గంటల ముందు నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు గానీ, రాజకీయ పార్టీలు గానీ ఎలాంటి బల్క్ ఎస్ఎంఎస్ లు ఇవ్వకూడదని, ఎవరైనా ఈ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి బల్క్ ఎస్ఎంఎస్ లు పంపించినట్లయితే చట్టరీత్యా తగు చర్య తీసుకోబడుతుందని తెలిపారు. ఈ విషయాన్ని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలతోపాటు మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు కూడా దృష్టిలో ఉంచుకుని మే 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4గంటల వరకు ఎలాంటి బల్క్ ఎస్ఎంఎస్ లు ఇవ్వవద్దని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల కోరారు.

Related posts

కాశ్మీర్ లో సీబీఐ నకిలీ స్పెషల్ ఆఫీసర్ అరెస్టు

Divitimedia

రూ.2.48 కోట్ల విలువైన 993 కిలోల గంజాయి దహనం

Divitimedia

ఐసీడీఎస్ లో ‘ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్’ దే పైచేయి

Divitimedia

Leave a Comment