ఎన్నికలకు ఆదాయపు పన్ను శాఖ 24×7 కంట్రోల్ రూమ్
✍️ దివిటీ మీడియా – హైదరాబాదు, మార్చి 28
ఎన్నికల సమయంలో అక్రమ నగదు/ఆభరణాల దుర్వినియోగాన్ని పర్యవేక్షించడానికి, అరికట్టడానికి ఆర్థిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఆదాయపుపన్ను శాఖ, హైదరాబాద్ విభాగం 24×7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ప్రజలు తమ ఫిర్యాదులు నమోదు చేసుకునేందుకు, ఫోన్ కాల్, వాట్సాప్, ఇ-మెయిల్ ద్వారా సమాచారాన్ని అందించవచ్చని ప్రకటించారు. లోక్‌సభ సాధారణ ఎన్నికల షెడ్యూల్-2024 విడుదలై దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఈ నిరంతరాయ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అక్రమ నగదు/నగల దుర్వినియోగాన్ని పర్యవేక్షించడం, అరికట్టడం కోసం కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నిరంతరాయంగా 24గంటలూ, వారంలో ఏడు రోజులూ (24×7) పని చేస్తుంది. పౌరులు ఎన్నికల ప్రయోజనం కోసం నిల్వ చేయబడిన/రవాణా/ పంపిణీ చేయబడిన నగదు/ ఆభరణాల సమాచారం అందించవచ్చని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాకైనా అటువంటి సమాచారాన్ని అందించడానికి వీలుగా సంప్రదింపు నెంబర్లు, ఇ-మెయిల్, అడ్రసును ఉపయోగించవచ్చు.
ఫిర్యాదులు, సమాచారం అందించేందుకు…
టోల్ ఫ్రీ నెంబర్: 1800-425-1788
ల్యాండ్‌లైన్ నెంబర్: 040-23426201/ 23426202
వాట్సాప్ నెంబర్: 91-8688701400
ఇ-మెయిల్ ఐడి: cleantelanganaelections@incometax.gov.in