ఖమ్మంలో ఎల్ఐసీ ఏజెంట్ల సమాఖ్య డివిజన్ జనరల్ బాడీ మీటింగ్
✍ దివిటీ మీడియా – ఖమ్మం, ఫిబ్రవరి 26
ఖమ్మంలో జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య వరంగల్ డివిజన్ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో సమాఖ్య ఆల్ ఇండియా సెక్రెటరీ జనరల్ మార్కండేయ పాల్గొని ఎల్ఐసీ ఏజెంట్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించారు. ఏజెంట్లకి బిజినెస్ విషయంలో దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో సమాఖ్య ఆల్ ఇండియా సెక్రెటరీ మార్కండేయతోపాటు సౌత్ సెంట్రల్ జోన్ అధ్యక్షుడు వేణుగోపాలరెడ్డి, డివిజన్ అధ్యక్షుడు కోసంగుల రామారావు, ప్రతినిధులు కోటేరు వెంకటరెడ్డి, ఎ.వి నర్సిరెడ్డి, ఎస్.కె జానీమియా, తదితరులు పాల్గొన్నారు.