Divitimedia
Bhadradri KothagudemHealthHyderabadLife StyleTechnologyTelangana

జిల్లా ఆసుపత్రిలో బయోమెట్రిక్ హాజరు తీరుపై కలెక్టర్ ఆగ్రహం

జిల్లా ఆసుపత్రిలో బయోమెట్రిక్ హాజరు తీరుపై కలెక్టర్ ఆగ్రహం

రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలి : కలెక్టర్ డా.ప్రియాంకఅల

✍ దివిటీ మీడియా – కొత్తగూడెం, ఫిబ్రవరి 24

జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో సిబ్బంది హాజరు బయోమెట్రిక్ రికార్డులు పరిశీలించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డా.ప్రియాంకఅల, అక్కడి వైద్యులు, సిబ్బంది అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది హాజరు బయోమెట్రిక్ విధానంలో నూరుశాతం నమోదై ఉండాలని ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించారు. కొత్తగూడెంలో జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిని శుక్రవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఈ సందర్భంగా ఆమె ఆదేశించారు. ఆసుపత్రి వార్డులు పరిశీలించి రోగులతో మాట్లాడి, వారికందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎమర్జెన్సీ వార్డు, ఆర్థోపెడిక్ వార్డు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ తదితర ప్రాంతాలు సందర్శించి రోగుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెడికల్ స్టోర్, లేబర్ రూమ్, ఆపరేషన్ థియేటర్లను పరిశీలించారు. సందర్శించి, వైద్యసేవలు అందుతున్నతీరు, సక్రమంగా మందులు ఇస్తున్నారా? లేదా? అనే విషయాలపై రోగులతో ఆరా తీశారు. ఎమర్జెన్సీ వార్డులో డాక్టర్లు రోగులకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చికిత్సలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రులకు పేదవారు వస్తారు గనుక వారికి మెరుగైన సేవలందించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలన్నీ కల్పిస్తున్నందున ప్రజలు వినియోగించుకునేలా చూడాలని, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోకుండా వారికి అవగాహన కల్పించాలన్నారు. ఆసుపత్రి అభివృద్ధి పనులకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. ఆసుపత్రి బయట డ్రైనేజీ నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు కావలసిన ప్రతిపాదనలు సిద్ధం చేసి నివేదిక సమర్పించాలని ఆర్ అండ్ బి ఈఈ వెంకటేశ్వర్లును ఆదేశించారు. వారంరోజుల్లో ఆస్పత్రిలో పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని ఆస్పత్రి ఏఓను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ శిరీష, ఆసుపత్రి ఇంచార్జి సూపరింటెండెంట్ డాక్టర్.లక్ష్మణరావు, ఆర్ఎంఓ జీజీహెచ్ డాక్టర్.పుష్పలత, ఆర్ఎంఓ ఎంసీహెచ్ (రామవరం) డాక్టర్.వీరబాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్.సురేందర్, మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

స్థానిక సంస్థల ఎన్నికలకోసం సస్పెక్ట్, రౌడీషీటర్స్ కు కౌన్సెలింగ్

Divitimedia

పినపాక నియోజకవర్గంలో మంత్రి పువ్వాడ విస్తృత పర్యటన

Divitimedia

Divitimedia

Leave a Comment