Divitimedia
Bhadradri KothagudemHyderabadLife StylePoliticsTechnologyTelangana

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 370015 దరఖాస్తులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3,70,015 దరఖాస్తులు

ఎనిమిది రోజుల ‘ప్రజాపాలన’ గ్రామసభలకు ముగింపు

చివరిరోజు గ్రామసభలలో పాల్గొన్న ఎమ్మెల్యేలు

✍🏽 దివిటీ – భద్రాద్రి కొత్తగూడెం (జనవరి 7)

తెలంగాణలో దాదాపు పదేళ్ల తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా ప్రజల ముంగిటకు వచ్చి ఎనిమిది రోజులపాటు నిర్వహించిన ‘ప్రజాపాలన కార్యక్రమం’ శనివారం (జనవరి 6) ప్రశాంతంగా ముగిసింది. తమకు సంక్షేమపథకాలందించే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం గ్రామసభలు నిర్వహించిన నేపథ్యంలో ప్రజలందరూ దరఖాస్తు చేసుకున్నారు. ఎంతో క్రమశిక్షణ కలిగిన సైనికులలాగా ప్రజలు ‘లైన్లలో నిలబడి’ మరీ దరఖాస్తులు సమర్పించడం గమనార్హం. ప్రభుత్వంపై నమ్మకంతో, ఆశతో ప్రజలందరూ దరఖాస్తులు ఇచ్చారు.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం నిర్వహించిన ‘జన్మభూమి కార్యక్రమం’, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ‘ఇందిరమ్మ గ్రామసభలు’, ఆ తర్వాత జరిగిన ‘ప్రజల వద్దకు పాలన’ వంటి కార్యక్రమాలకు భిన్నంగా పూర్తి ప్రశాంతంగా ఇప్పటి గ్రామసభలు పూర్తి కావడం విశేషం. “ఊకదంపుడు ఉపన్యాసాలు, సుధీర్ఘ సందేశాలు, నేతల డబ్బా ప్రసంగాలు లేకుండా నేరుగా దరఖాస్తులు స్వీకరించే విధంగా నిర్వహించడం వల్ల ఈ గ్రామసభలు ప్రశాంతంగా ముగిశాయి” అంటూ బూర్గంపాడు మండలానికి చెందిన ఓ అధికారి ‘దివిటీ మీడియా’ వద్ద అభిప్రాయపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రామసభలు ప్రశాంతంగా ముగియడం పట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ పియాంకఅల హర్షం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ కలెక్టర్ అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వం ప్రకటించిన అభయహస్తం ఆరు గ్యారంటీలలో భాగంగా మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు జిల్లా పరిధిలోని 481 గ్రామపంచాయతీలు, 4 మున్సిపాలిటీలలో ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించినట్లు చెప్పారు. జిల్లా పరిధిలోని 3,22,501 గృహాల నుంచి 3,33,370 ఆరు గ్యారెంటీల దరఖాస్తులతోపాటు ఇతర రకాల దరఖాస్తులు 36,645 కూడా వచ్చినట్లు కలెక్టర్ ప్రకటించారు. ప్రజాపాలన గ్రామ సభల నిర్వహణపై గ్రామగ్రామాన, మున్సిపల్ వార్డుల్లో విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజలకు ఉచితంగా దరఖాస్తు ఫారాలు అందజేసినట్లు జిల్లాకలెక్టర్ ప్రకటించారు. అయితే పలుచోట్ల ప్రజలు దరఖాస్తు ఫారాలను బయట కొనుక్కుని మరీ దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఒక్క అపశృతి మినహా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ గ్రామసభలలో ప్రజలు పాల్గొని ప్రశాంతంగా దరఖాస్తులు అందజేశారు. ఈ ప్రజాపాలన గ్రామసభల్లో వచ్చిన ప్రతి దరఖాస్తులోని సమాచారాన్ని ఆన్లైన్ లో నిక్షిప్తం చేస్తున్నట్లు జిల్లాకలెక్టర్ పేర్కొన్నారు. డేటా నమోదు ప్రక్రియపై ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చామని, మండలస్థాయిలో తహశీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. దరఖాస్తుల ఆన్ లైన్ నమోదులో ఎలాంటి పొరపాట్లుకు తావులేకుండా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నమోదు చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ఎనిమిది రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన దరఖాస్తుల వివరాలు మండలాలవారీగా ఇలా ఉన్నాయి.

——————————-

చివరిరోజు ప్రజాపాలన గ్రామసభలలో పాల్గొన్న ఎమ్మెల్యేలు

——————————–

కరకగూడెంలో ప్రజాపాలన గ్రామసభలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఇల్లందు మండలం ఒడ్డుగూడెం గ్రామపంచాయతీలో ప్రజాపాలన కార్యక్రమంలో కోరం కనకయ్య పాల్గొన్నారు.

చుంచుపల్లి మండలం పెనగడప గ్రామ పంచాయతీలో ప్రజాపాలన గ్రామసభలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు.

దమ్మపేట మండలం గొర్రెగుట్ట గ్రామంలో ప్రజాపాలన గ్రామసభలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొన్నారు.

Related posts

ఆత్మహత్యకు యత్నించిన వృద్ధురాలిని కాపాడిన బ్లూకోల్ట్స్ పోలీసులు

Divitimedia

సాగు చేస్తున్నవారికే రైతు భరోసా అందించాలన్న రైతులు

Divitimedia

మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

Divitimedia

Leave a Comment