రామవరం ప్రభుత్వ హైస్కూల్లో ‘చేయూత’
✍🏽 దివిటీ – కొత్తగూడెం (జనవరి 2)
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్రమశిక్షణ కలిగిన విద్యార్థులకు చిరు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. సక్రమంగా పాఠశాలకు హాజరవుతూ, చదువుపై ఆసక్తి కనబరుస్తున్న విద్యార్థులకు అవసరమయ్యే సకల విద్యాసామాగ్రిని ప్రోత్సాహంగా అందించేందుకు నిర్ణయించినట్లు ప్రధానోపాధ్యాయుడు డాక్టర్ ప్రభుదయాళ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం పెన్నులు, జామెట్రీ బాక్సులను అందించారు. ఇదే తరహాలో విద్యాసామాగ్రి ప్రోత్సాహంగా అందిస్తామని, చదువుపై పట్టు సాధించాలని ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను కోరారు.