Divitimedia
Bhadradri KothagudemEducationLife StyleSportsTelanganaYouth

‘బ్రిలియంట్’ టాలెంట్ టెస్ట్ విజేతలకు బహుమతులు

‘బ్రిలియంట్’ టాలెంట్ టెస్ట్ విజేతలకు బహుమతులు

విజేతలను అభినందించిన ఎస్సై రాజ్ కుమార్

✍🏽 దివిటీ – బూర్గంపాడు (జనవరి 2)

బూర్గంపాడు మండలం సారపాకలోని బ్రిలియంట్ విద్యాసంస్థలు నిర్వహించిన బ్రిలియంట్ మెగా టాలెంట్ టెస్ట్ లో విజేతలైన విద్యార్థులకు మంగళవారం బహుమతి ప్రధానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న బూర్గంపాడు ఎస్సై రాజ్ కుమార్ విజేతలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థి దశలోనే విద్య ప్రాధాన్యతను తెలుసుకుని కష్టపడి చదవాలని సూచించారు. ఎన్నో ఆశలు పెట్టుకుని తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని భగవంతుడి కంటే శ్రేయస్సు కోరే తలిదండ్రులకు, మీకోసం ప్రతిక్షణం తపనపడే పాఠశాలకు మంచి పేరు తేవాలని ఆయన కోరారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా భవిష్యత్తులో విలువలతో కూడిన సూచనలు చేశారు. ఇలాంటి పోటీలు పెట్టడం వల్ల విద్యార్థులలోని ప్రతిభను గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. బ్రిలియంట్ విద్యా సంస్థల చైర్మన్ బి నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలు మానసిక సామర్థ్యాన్ని పెంచడానికి ఎంతో ఉపయోగపడతాయని, విద్యార్థుల్లో చురుకుదనం ఉంటుందని తెలియజేశారు. ఈ టాలెంట్ టెస్టులో వివిధ కేటగిరీలలో విజేతలైన కె.వల్లిశ్రీ, అలివేణి, విజయ, కె.చతురవత్సల్, జి.మోనిష్ ఐరి, జి.శాన్వి, డి.సింహవర్ధన్ రెడ్డి, కె.సురేంద్రచారి బహుమతులు అందుకున్నారు. ఈ సందర్భంగానే బ్రిలియన్ మెగా క్రికెట్ టోర్నమెంట్ లో ఆరావలి హౌస్ విన్నర్స్ ట్రోఫీ, ఉదయగిరి హౌస్ రన్నర్స్ ట్రోఫీని కైవసం అందుకున్నారు. కార్యక్రమంలో బ్రిలియంట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Related posts

జగన్ పై తాజాగా తీవ్ర ఆరోపణలు చేసిన షర్మిల

Divitimedia

సీతారామ లిఫ్ట్ పంపుహౌస్ పరిశీలించిన జిల్లాకలెక్టర్

Divitimedia

తప్పులు చెరుపుకోవాలని… తప్పించుకు తిరుగుతున్నాడు…

Divitimedia

Leave a Comment