Divitimedia
Spot News

పారిశ్రామికవేత్తలకు పూర్తి సహాయ సహకారాలు : సీఎం రేవంత్ రెడ్డి

పారిశ్రామికవేత్తలకు పూర్తి సహాయ సహకారాలు : సీఎం రేవంత్ రెడ్డి

✍🏽 దివిటీ – హైదరాబాదు (డిసెంబర్ 26)

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డా.బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో సీఎంను ఫాక్స్ కాన్ కు చెందిన హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీస్ ప్రతినిధి వీలీ నేతృత్వంలోని బృందం మంగళవారం కలిసింది. రాష్ట్ర ఐ.టి, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి,ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్షలను కాపాడే బాద్యత కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వంపై ఉందన్నారు. అన్ని వర్గాలకు స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని అవలంబిస్తున్నాం కాబట్టి, పారిశ్రామిక వేత్తలకు కూడా పూర్తి సహాయ, సహకారాలందిస్తామన్నారు. పరిశ్రమల అభివృద్ధి, ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు సులభంగా అందించడంతోపాటు, మౌలిక సదుపాయాలను కల్పిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటామని ఆయన తెలియజేశారు.

Related posts

మానవత్వం చాటుకున్న మంత్రి పొంగులేటి

Divitimedia

60ఏళ్లు నిండినవారందరికీ ఆర్టీసీ బస్సుల్లో 25 శాతం రాయితీ

Divitimedia

‘ఆర్సీఓ’గా బాధ్యతలు చేపట్టిన అరుణకుమారి

Divitimedia

Leave a Comment