Divitimedia
Spot News

మందుల కోసం నేస్తం ట్రస్ట్ ఆర్థికసాయం

మందుల కోసం నేస్తం ట్రస్ట్ ఆర్థికసాయం

✍🏽 దివిటీ – బూర్గంపాడు (డిసెంబర్ 25)

మోరంపల్లిబంజర్ గ్రామానికి చెందిన నేస్తం వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జింకలగూడెం గ్రామానికి చెందిన సయ్యద్ ఖాసిం అనే వ్యక్తికి సోమవారం రూ.6000 సహాయం అందించారు. నిరుపేద కుటుంబం కావడంతో కూలీపనులు చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్న ఖాసిం రెండు నెలల క్రితం తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. వైద్యులు కిడ్నీ ఇన్ఫెక్షన్, మూత్రాశయంలో గడ్డ ఏర్పడిందని గుర్తించి ఆపరేషన్ చేసి ఆ గడ్డను తొలగించారు. అప్పటి నుంచి ఇంటివద్దనే ఖాళీగా ఉండటంతో మందుల ఖర్చులకు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితి తెలుసుకున్న నేస్తం ట్రస్ట్ స్పందించి ఖర్చులకోసం రూ.6000 సహాయం చేశారు. తన కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండి, అనారోగ్యం కారణంగా ఆర్దికంగా ఇబ్బంది పడుతున్న ఖాసిం కుటుంబానికి భవిష్యత్తులో కూడా తమ నేస్తం ట్రస్ట్ అండగా ఉంటుందని అధ్యక్షుడు బత్తుల రామకొండారెడ్డి హామీ ఇచ్చారు. ఆపదలో ఉన్న పేదవారికి తమ వంతు సాయం చేయడానికి తమ ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చింతా అంకిరెడ్డి, సభ్యులు సంకా సురేష్, డి బాలనారాయణరెడ్డి, గ్రామస్తులు షేక్ మదార్, మౌలానా, జమాల్, పెద్దహుస్సేన్ పాల్గొన్నారు.

Related posts

‘ఐసీడీఎస్’లో అధికారుల వసూళ్లపై ఆర్జేడీ విచారణ

Divitimedia

నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

Divitimedia

మునగసాగు రైతుల పాలిట వరం

Divitimedia

Leave a Comment