వేడుకగా రెడ్డి సంఘం వనభోజనాలు
✍🏽 దివిటీ – మణుగూరు (డిసెంబర్ 24)
మణుగూరు మండలం తోగ్గూడెంలోని సమ్మక్క- సారక్క ఆలయం వద్ద ఆదివారం రెడ్డిసంఘం ఆధ్వర్యంలో వన భోజనాలు వేడుకగా నిర్వహించారు. మణుగూరు మండల రెడ్డిసంఘం నిర్వహించిన 14వ వనభోజన కార్యక్రమంలో పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఆయనకు రెడ్డిసంఘం ప్రతినిధులు పుష్పగుచ్ఛంతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రెడ్డిసంఘం అభివృద్ధికి ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందించి అభివృద్ధికి తోడ్పాటునందిస్తానని హామీనిచ్చారు. సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకురాలు రాణిరుద్రమరెడ్డి, రెడ్డిసంఘం నాయకులు, సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.