ఉత్సాహంగా జిల్లాస్థాయి యువజనోత్సవాలు
రాష్ట్రస్థాయి పోటీలకు ముగిసిన యువ కళాకారుల ఎంపిక
✍🏽 దివిటీ – భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి యువజనోత్సవాలు కొత్తగూడెం క్లబ్బులో గురువారం ఉత్సాహంగా సాగాయి. “వివేకానంద స్వామి జయంతి సందర్భంగా జరిగిన ఈ జిల్లా స్థాయి ఉత్సవాల్లో స్థాయిలో దాదాపు 450 మంది యువ కళాకారులు పాల్గొన్నారు. జానపద నృత్యం, జానపదగేయాలు, వ్యాసరచన, వక్తృత్వం, పెయింటింగ్ ఫోటోగ్రఫీ విభాగాల్లో గెలుపొందిన విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నట్లు జిల్లా యువజన సర్వీసులు, క్రీడల అధికారి పరంధామరెడ్డి ప్రకటించారు. వారికి మెమెంటోలు మరియు మెరిట్ సర్టిఫికెట్స్ ముఖ ద అతిధులతో ఇపంచటం జరిగినది .
ఈ కార్యక్రమంలో ముఖ్య ఆతిదులుగా పాల్గొన్న జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ టి.సీతారామ్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి సులోచనారాణి, కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ కె.రమేష్ తోపాటు డీవైఎస్ఓ పరంధామరెడ్డి చేతుల మీదుగా విజేతలకు మెమెంటోలు, మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు. సాంసృతిక కళాబృందాల ప్రదర్శనలు అలరించాయి. న్యాయ నిర్ణేతలుగా బాలు, గజల్ రాకేష్, నాగలక్ష్మి, చిరంజీవి, శ్రీనివాస్, పవన్. సంతోషి వ్యవహరించారు.
*
విజేతల వివరాలు….
*
- జానపద నృత్యం (గ్రూప్)
మొదటి బహుమతి : భవ్య టీమ్ (కెఎల్ఆర్ ఫార్మసీ కాలేజి, పాల్వంచ)
రెండవ బహుమతి : కావ్య టీమ్ (టీఎస్ రెసిడెన్షియల్ కాలేజి, బూర్గంపాడు)
- జానపద నృత్యం (సోలో)
మొదటి బహుమతి : వెన్నెల (పాల్వంచ)
రెండవ బహుమతి : దుర్గ (టీఎస్ రెసిడెన్షియల్ కాలేజి, బూర్గంపాడు)
- జాన పద గేయాలు: (గ్రూప్)
మొదటి బహుమతి : స్పందన టీమ్ (తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కాలేజి)
రెండవ బహుమతి : మోనాలిసా (ప్రభుత్వ జూనియర్ కాలేజి, కొత్తగూడెం)
- జానపద గేయాలు (సోలో)
మొదటి బహుమతి : తరుణ్ తేజ్ (కెఎల్ఆర్ కాలేజి, పాల్వంచ)
రెండవ బహుమతి : ఉమాదేవి (అనుబోస్ ఇంజినీరింగ్ కాలేజి, పాల్వంచ)
- వ్యాసరచన
మొదటి బహుమతి : వి.సరస్వతి (అనుబోస్ ఇంజినీరింగ్ కాలేజి, పాల్వంచ)
రెండవ బహుమతి : ఎల్.నాగయగ్నేశ్వర్ (ప్రభుత్వ పాలిటెక్నిక్, కొత్తగూడెం)
- వక్తృత్వము
మొదలు బహుమతి : ఎస్.వంశీ (కెఎల్ఆర్ కాలేజి, పాల్వంచ)
రెండవ బహుమతి : ఎ.సుప్రియ (అనుబోస్ ఇంజినీరింగ్ కాలేజి, పాల్వంచ)
- పెయింటిగ్:
మొదటి బహుమతి : కె.కుసుమ (సింగరేణి ఉమెన్స్ కాలేజి, కొత్తగూడెం)
రెండవ బహుమతి : కె.సుస్మిత (టీఎస్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, పాల్వంచ)
- ఫొటోగ్రఫీ
మొదటి బహుమతి : సీహెచ్.తరంగిణి (అనుబోస్ ఇంజినీరింగ్ కాలేజి, పాల్వంచ)
రెండవ బహుమతి : ఎ.విక్రమ్ తేజ (ప్రభుత్వ జూనియర్ కాలేజి, కొత్తగూడెం)








