Divitimedia
Bhadradri KothagudemHealthHyderabadLife StyleTelangana

కోవిడ్ పట్ల అప్రమత్తంగా వుండాలి : జిల్లా కలెక్టర్

కోవిడ్ పట్ల అప్రమత్తంగా వుండాలి : జిల్లా కలెక్టర్

✍🏽 దివిటీ – భద్రాద్రి కొత్తగూడెం

కోవిడ్ పట్ల అప్రమత్తంగా వుండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల ఆదేశించారు. గురువారం ఆమె తన చాంబర్లో కోవిడ్ ముందస్తు జాగ్రత్తలు, నియంత్రణ చర్యలపై వైద్యారోగ్యశాఖ అధికారులతో నియంత్రణ చర్యలపై సమీక్షించారు. జిల్లాలో కోవిడ్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో గత మే నెల నుంచి కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాలేదన్నారు. ఇప్పుడు కొవిడ్ లక్షణాలున్నవారికి పరీక్షలు చేయాలని చెప్పారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో కోవిడ్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కోవిడ్ నియంత్రణకు డ్రగ్స్, ఆక్సిజన్, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, మాస్కులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ముక్కోటి ఉత్సవాలకు వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించాలని ఈ సందర్భంగా కలెక్టర్ డా ప్రియాంకఅల కోరారు. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని చెప్పారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్.శిరీష, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ముక్కోటి మహోత్సవాల్లో బాధ్యతగా విధులు నిర్వర్తించాలి

Divitimedia

క్రికెట్ అభిమానులకు ప్రపంచకప్ ‘కనులవిందు’

Divitimedia

పీఎం కిసాస్ సమ్మాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని

Divitimedia

Leave a Comment