స్కూల్ గేమ్స్ జాతీయ క్రీడాకారులను అభినందించిన జిల్లా కలెక్టర్ ప్రియాంకఅల
స్కూల్ గేమ్స్ కార్యదర్శి స్టెల్లా ప్రేమ్ కుమార్ బృందానికి ప్రత్యేకాభినందనలు
✍🏽 దివిటీ మీడియా – క్రీడా విభాగం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 67వ జాతీయస్థాయి పాఠశాలల క్రీడాపోటీలకు ఎంపికైన అథ్లెటిక్స్, కరాటే క్రీడాకారులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల బుధవారం(13-12-2023) తన కార్యాలయంలో అభినందించారు. ఇటీవల వరంగల్ లో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో డిస్కస్ త్రో అంశంలో అండర్-14 విభాగంలో పాల్గొన్న జిల్లాకు చెందిన సీహెచ్ వేదశ్రీ, డి.మధుప్రియ జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. లాంగ్ జంప్ విభాగంలో ఎం.శ్రీవిద్యదొర జాతీయస్థాయి పోటీలకు ఎంపికవగా, అండర్-17 విభాగంలో 400 మీటర్ల పరుగుపందెంలో బి.ఆశాశ్రీ, హామర్ త్రో అంశంలో బి.పల్లవి, 100మీటర్ల హర్డిల్స్ అంశంలో ఎస్కే.అమ్రీన్ జాతీయస్థాయికి ఎంపికయ్యారు. అండర్-19విభాగంలో 3కిలోమీటర్ల పరుగుపందెంలో ఎం.సంగీత, డిస్కస్ త్రో, షాట్ పుట్ త్రో అంశాల్లో ఎస్కే. రియాజ్ పాషా, 400మీటర్లు, 200మీటర్ల పురుగుపందెంలో జె.వరుణ్, 1500మీటర్లు, 3కిలోమీటర్ల విభాగంలో ఎం.అఖిల్, 6కిలోమీటర్ల విభాగంలో ఎం.ప్రేమ్ కుమార్ జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
అండర్-17 విభాగంలో కరాటే అంశంలో బి.సాయివరుణ్ జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలు ఈ నెల(డిసెంబర్) 16 నుంచి లక్నోలో, కరాటే జాతీయస్థాయి పోటీలు ఈ నెల15 నుంచి ఢిల్లీలో జరగనున్నాయి. జిల్లా నుంచి పలువురు విద్యార్థులు జాతీయస్నాయికి ఎంపిక కావడం పట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వాహక కార్యదర్శి టి.స్టెల్లాను, అందుకు సహకరించిన వ్యాయామ ఉపాధ్యాయులను అభినందించారు. కరాటే క్రీడాకారులకు తర్ఫీదునిచ్చిన ఇంద్రాల శ్రీధర్ ను కూడా జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు, డీఈఓ వెంకటేశ్వరాచారి కూడా విజేతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమాలలో జిల్లా యువజన, క్రీడల అధికారి ఎం.పరంధామరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్లొన్నారు.