బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి పొంగులేటి కుటుంబం
✍🏽 దివిటీ మీడియా – విజయవాడ
బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాధురి దంపతులు సోమవారం (డిసెంబర్ 11) దర్శించుకున్నారు. వారి వెంట మంత్రి సోదరుడు పొంగులేటి ప్రసాదరెడ్డి, శ్రీ లక్ష్మి దంపతులు కూడా ఉన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని తాము అమ్మవారిని వేడుకున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. తొలుత ఆలయ కమిటీ బాధ్యులు మంత్రి పొంగులేటికి ఘనంగా స్వాగతం పలికారు. శాలువ, మెమొంటోను అందచేసి మంత్రి పొంగులేటిని ఆలయ మర్యాదలతో సత్కరించారు.