Divitimedia
Bhadradri KothagudemHealthKhammamLife StyleTelanganaWomen

అనాధలకు ఎం.ఆర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు

అనాధలకు ఎం.ఆర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు

✍🏽 దివిటీ మీడియా – భద్రాచలం, ఖమ్మం

కార్తీకమాసం పౌర్ణమి సందర్భంగా ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలంలలో ఎం.ఆర్ ఫౌండేషన్ తరపున అనాధలు, పేదలకు  సోమవారం సేవా కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రక్కన తీవ్రమైన చలిలో  ఇబ్బంది పడుతున్న అనాధలకు ఎం.ఆర్ ఫౌండేషన్ తరపున 500 దుప్పట్లు  పంచి పెట్టారు. ఖమ్మంలోని అనాధ బాలికల ఆశ్రమంలో భోజనాలు అందజేశారు. ఎం.ఆర్ ఫౌండషన్ కన్వీనర్ మాధవి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భద్రాచలం నుంచి విక్రమ్ వర్మ, చైతన్యరెడ్డి, అలె శ్రీను, మదుసూధన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రమణారెడ్డి, ఫణికుమార్,
సుభద్ర, ప్రసాద్, శ్రీశైలం నుంచి శ్రీరామ్,  భాస్కర్, ప్రసాద్,  శ్రీకాళహస్తి నుంచి సాస్ట్రీ, ఖమ్మం నుంచి రాజశేఖర్, నవీన్, రవికుమార్ రెడ్డి, కిషోర్, ప్రసాద్ (రాజమండ్రి), విజయ్, వెంకటలక్ష్మి   (కొత్తగూడెం),
రామారావు (గుంటూరు), తధితరులు సహకారం అందించారు. కార్యక్రమాలను  జ్ఞానదీప్ రెడ్డి, ఆశిష్ రెడ్డి నిర్వహించారు.

Related posts

మహబూబ్‌నగర్‌లో రూ.13,500 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పథకాలు జాతికి అంకితం, శంకుస్థాపన చేసిన ప్రధాని

Divitimedia

గ్రామపంచాయతీ ట్రాక్టర్ పల్టీ, కార్మికుడికి తీవ్ర గాయాలు

Divitimedia

ఇంతేనా సంక్షేమం… మరీ ఇదేం నిర్లక్ష్యం…?

Divitimedia

Leave a Comment