ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన నోడల్ అధికారి
✍🏽 దివిటీ మీడియా – కొత్తగూడెం
కొత్తగూడెం రామవరంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల(నేతాజీ పాఠశాల)ను నోడల్ అధికారి డాక్టర్ ప్రభుదయాల్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా తొలిమెట్టు కార్యక్రమానికి సంబంధించి వివరాలను ఉపాధ్యాయులతో చర్చించారు. విద్యార్థుల హాజరు వివరాలు పరిశీలించిన ఆయన 100శాతం హాజరు ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు హోమ్ వర్క్, క్లాస్ వర్క్ ఇస్తుండాలని, పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్స్ తో టీచింగ్, లెర్నింగ్ పద్ధతుల్లో సమగ్రంగా విద్యాబోధన జరగాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు చదవడం, రాయడం సక్రమంగా రావాలని, గణితంలో ప్రాథమిక అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని కూడా సూచించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలో చేపట్ట వలసిన చర్యలను సవివరంగా విశ్లేషించి, పాటించవలసిందిగా సూచించారు.