సారపాక, కృష్ణసాగర్ గ్రామాల్లో కాంగ్రెస్ విస్తృతప్రచారం
✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు
కాంగ్రెస్ పార్టీ పినపాక నియోజకవర్గ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు గెలుపు కోరుతూ గురువారం బూర్గంపాడు మండలం సారపాక, కృష్ణసాగర్ గ్రామాల్లో ‘గడపగడపకు కాంగ్రెస్’ కార్యక్రమం చేపట్టి విస్తృతంగా ప్రచారం చేశారు. నాయకులు
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ బూర్గంపాడు మండల అధ్యక్షుడు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుఢు మొహ్మద్ ఖాన్, జిల్లా కార్యదర్శి చల్లా వెంకటనారాయణ, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మండల గౌరవ అధ్యక్షుడు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, ఓబుల్ రెడ్డి, బొడ్డు నాగరాజు, సింగూరి నరసింహారావు, దేవిరెడ్డి వెంకటరెడ్డి, నియోజకవర్గ యూత్ కార్యదర్శి రహీంఖాన్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అన్వర్, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.