Divitimedia
Bhadradri KothagudemLife StylePoliticsTechnologyTelangana

ఎంసీఎంసీ పర్యవేక్షణ నిరంతరం కొనసాగాలి : కలెక్టర్ డా.ప్రియాంకఅల

ఎంసీఎంసీ పర్యవేక్షణ నిరంతరం కొనసాగాలి : కలెక్టర్ డా.ప్రియాంకఅల

✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం

రాజకీయ ప్రకటనలపై ఎంసీఎంసీ కమిటీ నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్. ప్రియాంకఅల తెలిపారు. శనివారం కలెక్టర్ ఛాంబర్ లో ఎన్నికల ప్రక్రియలో జారీ చేయాల్సిన ప్రి సర్టిఫికేషన్, పెయిడ్ న్యూస్, సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలపై ఎంసీఎంసీ, సోషల్ మీడియా పర్యవేక్షణ  కమిటి సమావేశం నిర్వహించారు. కలెక్టర్  మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా  నియమావళి పకడ్బందీగా అమలు చేయడంలో భాగంగా వివిధ మాద్యమాల ద్వారా ప్రసారమయ్యే ప్రకటనలను నిరంతరం పర్యవేక్షిస్తూ, లోకల్ ప్రచారం కోసం అవసరమయ్యే అనుమతులను  జిల్లా మీడియా సర్టిఫికేషన్ మరియు మానిటరింగ్ కమిటి (ఎంసీఎంసీ) జారీ చేయాలన్నారు. కమిటీ సభ్యులు నిరంతరం వివిధ దినపత్రికలు, టెలివిజన్, సామాజిక మాధ్యమాలు, సిటీ కేబుల్, తదితర ప్రచార మాధ్యమాలలో ప్రసారమయ్యే చెల్లింపు వార్తలు, రాజకీయ ప్రకటనలను తనిఖీ చేయడంతోపాటు ప్రసారాలు, ప్రకటనలు వచ్చినట్లయితే ఎప్పటికప్పుడు వాటికి సంబంధించిన నివేదికలు రూపొందించి ఎన్నికల అధికారులకు పంపించాలని సూచించారు. ఎలక్ట్రానిక్ మీడియా, లోకల్ కేబుల్ ఛానెళ్లు, సోషల్ మీడియా, వాట్సాప్ ఛానెళ్లు, ఈ పేపర్లు, ఇతర ప్రసార మాధ్యమాలలో రాజకీయ ప్రకటనలు పరిశీలించాలని, అనుమతి లేకుండా ప్రకటనలు ప్రసారం చేస్తే ఆయా నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ద్వారా  నోటీసులు జారీ చేయాలని అన్నారు.
సోషల్ మీడియాలో విద్వేష పూరిత ప్రసంగాలు, కుల, మతాలు వంటి రెచ్చగొట్టే పోస్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని సోషల్ మీడియా టీముకు సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి  ఉల్లంఘించేలా ప్రకటనలు, పోస్టుల పై రిటర్నింగ్ అధికారుల ద్వారా నోటీస్ జారీచేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలు జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకురావాలని, సరైన సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాలని సూచించారు. పోస్టర్లు, కరపత్రాలు ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎన్నికల నిబంధనలకు లోబడి ప్రచురించాలన్నారు.  ఎన్నికల నిర్వహణలో ఎంసీఎంసీ కమిటీ బాధ్యత చాలా ప్రధానమైనదని, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పారు. ఏరోజు ప్రచురితమయ్యే పెయిడ్ న్యూస్ అదేరోజు లెక్కించి, వ్యయ నోడల్ అధికారికి నివేదికలు అందజేయాలని చెప్పారు. ఈ సమావేశంలో ఎంసీఎంసీ  కన్వీనర్, డీపీఆర్ఓ శ్రీనివాస్, ఆకాశవాణి ప్రోగ్రాం అధికారి శ్రీనివాసన్, కమిటీ సభ్యుడు జునుమాల రమేష్, ఈడీఎం విజయసారధి, జిల్లా సమాచార, విజ్ఞాన అధికారి ఎస్.సుశీల్ కుమార్, ఎస్పీ పిఆర్వో డి.శ్రీనివాస్, పోలీస్, ఐటీ పరిశీలకుడు నరేన్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

పార్ట్ టైం ఫ్యాకల్టీగా పనిచేసేందుకు దరఖాస్తుల ఆహ్వానం

Divitimedia

గ్రూప్ 3 పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

Divitimedia

తొలిసారి సొంత ఊరిలో ఓటు వేసిన వేపలగడ్డవాసులు

Divitimedia

Leave a Comment